బిజినెస్

మళ్లీ సుప్రీం కోర్టుకు మాల్యా గైర్హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: ధిక్కార కేసులో విజయ్ మాల్యా సుప్రీం కోర్టులో మళ్లీ హాజరుకాలేదు. ఈ కేసులో సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ మాల్యాను అత్యున్నత న్యాయస్థానం గతంలో ఆదేశించింది. అయినప్పటికీ ఆయన మాత్రం రాలేదు. దీంతో ఈ కేసు విచారణను జస్టిస్ ఎకె గోయల్, జస్టిస్ యుయు లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఈ నెల 14కు వాయిదా వేసింది. అంతేగాక సొలిసిటర్ జనరల్ సాయాన్ని కూడా కోరింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మాల్యాను.. భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో కోర్టు ధిక్కారం క్రింద తమ ఎదుటకు రావాలని సుప్రీం కోర్టు మే 9న ఆదేశించింది. కోర్టు ధిక్కారం నేరానికి గరిష్ఠంగా 2,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల వరకు జైలుశిక్ష పడుతుంది. ఒక్కోసారి ఈ రెండింటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే.