బిజినెస్

వస్త్ర వ్యాపారంపై జిఎస్‌టి తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: దేశంలోని వస్త్ర వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు వస్త్రాలపై విధించిన 5 శాతం వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ను తొలగించాలని వైఎస్‌ఆర్‌సిపి లోక్‌సభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. సుబ్బారెడ్డి ఈ మేరకు అరుణ్‌జేట్లీకి మంగళవారం ఒక లేఖ రాశారు. జిఎస్‌టికి ముందున్న పరిస్థితులను కొనసాగించాలని వస్త్ర వ్యాపారులు చేస్తున్న డిమాండ్‌ను ఆమోదించాలని ఆయన ఈ లేఖలో జైట్లీకి విజప్తి చేశారు.
5 శాతం జిఎస్‌టిని తొలగించాలన్న వస్త్ర వ్యాపారుల విజ్ఞ ప్తిని జిఎస్‌టి సమాఖ్య ముందుంచి సానుకూల నిర్ణయం తీసుకోవాలని సుబ్బారెడ్డి.. జైట్లీని కోరారు. దేశవ్యా ప్తంగా జిఎస్‌టిని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు జైట్లీని అభినందించిన సుబ్బారెడ్డి.. చిన్న వస్త్ర వ్యాపారులను ఆదుకోవాలని కోరారు. దేశంలో కోట్లాది మంది వస్త్ర వ్యాపా రులున్నారని, వీరు పెద్దగా చదువుకోలేదని, జీవనోపాధి కోసం వస్త్ర వ్యాపారం చేస్తున్నారన్న ఆయన 5 శాతం జిఎస్‌టి పన్ను విధించటం వలన వీరి వ్యాపారం బాగా దెబ్బతిని, కుటుంబాలు చిన్నాభిన్నమైపోయే ప్రమాదం ఏర్పడిందని తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. చదువురాని చిన్న వస్త్ర వ్యాపారులు కంప్యూటర్ల సహాయంతో లెక్కలు నిర్వహించి పన్ను ఎలా చెల్లించగలుగుతారని ఆయన జైట్లీని ఈ సందర్భంగా ప్రశ్నించారు. బీదవారైన వస్త్ర వ్యాపారుల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని వస్త్రాలపై విధించిన 5 శాతం జిఎస్‌టిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు జిఎస్‌టి కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా టెక్స్‌టై ల్స్ పరిశ్రమ ఆందోళన చేస్తూనే ఉంది. రహదారులపైకెక్కిన వస్త్ర వ్యాపారులు జిఎస్‌టిని తొలగించా లని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నా రు. ధర్నాలు, రాస్తారోకోలతో తమ నిరసనను వెలిబు చ్చుతూనే ఉన్నారు. ఈ నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమల్లోకి వచ్చినది తెలిసిందే. అప్పటి నుంచే వస్త్ర వ్యాపారులు ఆందోళన బాటపట్టారు. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ పరోక్ష పన్నుల విధానంలో 1,200ల కుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు.
ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుండగా, జిఎస్‌టి అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తొలి ఐదేళ్లు నష్టపరిహారం కూడా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే లగ్జరీ, ఆరోగ్యానికి హానికరం చేసే ఉత్పత్తులపై 43 శాతం వరకు పన్ను భారాన్ని మోపింది మోదీ సర్కారు. గరిష్ఠ పన్ను 28 శాతానికితోడు 15 శాతం అదనపు పన్ను వేస్తోంది.

చిత్రం.. జిఎస్‌టికి వ్యతిరేకంగా అమృత్‌సర్‌లలో మంగళవారం ఆందోళన చేస్తున్న వస్త్ర వ్యాపారులు