బిజినెస్

ఈ-మార్కెట్ ప్లేస్‌పై కేంద్రంతో తెలుగు రాష్ట్రాల ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: ‘ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్’ (జిఈఎం) విధానంలో ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాయ. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జిఈఎంపై రెండు రోజులుగా ఢిల్లీలో వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్‌కు మంగళవారం ఏపి సాంఘిక, గిరిజన శాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు కూడా హాజరైయ్యారు.
ఈ సమావేశంలో ఈ-మార్కెట్ విధానంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఒప్పంద ప్రతాలపై సంతకాలు చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు అరుణాచల్ ప్రదేశ్, అసోం, పుదుచ్చేరి, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. అనంతరం ఆనంద్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ ఈ-మార్కెట్ ప్లేస్ విధానం వల్ల గతంలో కంటే తక్కువ ధరలో నాణ్యమైన సరకు వినియోగదారులు పొందుతారని పేర్కొన్నారు.
ఈ విధానం తీసుకురావడం ద్వారా కొత్త ఒరవడికి కేంద్రం నాంది పలికినట్టు అయ్యిందని చెప్పారు. ముఖ్యంగా వసతి గృహాలకు నాణ్యమైన సరకులు, వస్తువులు తక్కువ ధరకే లభిస్తాయని మంత్రి ఆనంద్‌బాబు పేర్కొన్నారు.

చిత్రం.. ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఏపి మంత్రి ఆనంద్‌బాబు