బిజినెస్

‘ఉచిత అన్న ప్రసాదాలపై జిఎస్‌టి లేదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: మత సంస్థలు నిర్వహించే అన్న క్షేత్రాల్లో సప్లై చేసే ఉచిత ఆహారాన్ని జిఎస్‌టి పరిధినుంచి మినహాయించినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. అలాగే దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, దర్గాలు లాంటి ప్రార్థనా స్థలాల్లో పంపిణీ చేసే ప్రసాదాలపై కూడా వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మత సంస్థలు నిర్వహించే అన్న క్షేత్రాల్లో సప్లై చేసే ఉచిత ఆహారంపై జిఎస్‌టిని విధించనున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై ఆర్థిక శాఖ వివరణ ఇస్తూ, ఈ వార్త పూర్తిగా అబద్ధమని, అలా ఉచితంగా సప్లైచేసే ఆహారంపై జిఎస్‌టి విధించరని స్పష్టం చేసింది. అయితే ప్రసాదాలు తయారు చేయడానికి వాడే కొన్ని ముడి సరకులు, వాటి సేవలపై మాత్రం జిఎస్‌టి వర్తిస్తుంది. అలాంటి వాటిలో చక్కెర, ఖాద్య తైలాలు, నెయ్యి, వెన్న, ఈ సరకులను రవాణా చేయడానికి అందించే సేవలు లాంటివి ఉన్నాయి. జిఎస్‌టి విధానంలో ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం సరఫరా చేసినప్పుడు చక్కెరలాంటి వాటికి ప్రత్యేక పన్ను రేటును నిర్ణయించడం సాధ్యం కాదని కేంద్రం తెలిపింది. అందువల్ల మత సంస్థలు పంపిణీ చేసే ఉచిత ప్రసాదాలు, లేదా ఆహారం తయారీకి వాడే ముడి సరుకులు, లేదా ఇన్‌పుట్ సర్వీసులకు ఎండ్ యూజ్ ఆధారంగా మినహాయింపు ఇవ్వడం వాంఛనీయం కాదని కేంద్రం ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.