బిజినెస్

రిజర్వాయర్లపై సోలార్ పలకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 11: మహా విశాఖ నగర పాలక సంస్థ (జివిఎంసి) సంప్రదాయ ఇంధన వనరులను పెంపొందించుకునే దిశగా అడుగులేస్తోంది. ఖాళీ స్థలాల్లో సోలార్ పలకలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ ఉత్పాదనకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే మంచినీటి రిజర్వాయర్లపైనా సోలార్ పలకలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుదుత్పత్తి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటివరకు కేరళలోని కయంకలం వద్ద, పశ్చిమ బెంగాల్‌లో మరో రిజర్వాయర్‌పై మాత్రమే ఈ విధంగా సోలార్ పలకలను ఏర్పాటు చేసుకుని విద్యుదుత్పాదన చేస్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులకు ధీటుగా భారీ సోలార్ ప్రాజెక్టును జివిఎంసి చేపట్టనుంది. జివిఎంసి ఆధీనంలో నగర శివారులో గల ముడసర్లోవ రిజర్వాయర్ దీనికి వేదిక కానుంది. రోజుకు 2,000 కిలోవాట్ల (పిఇకె) విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. దీన్ని ఏపి గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణం కలిగిన ముడసర్లోవ రిజర్వాయర్ ద్వారా నగరానికి రోజుకు 0.3 ఎంజిడిల మంచినీరు సరఫరా అవుతోంది. అయితే రిజర్వాయర్ గర్భంలో వర్షాకాలం సీజన్ మినహా, మిగిలిన కాలంలో నీటి నిల్వ తక్కువగానే ఉంటుంది. ఈ రిజర్వాయర్ గర్భంపై సోలార్ నీటి పలకలను ఏర్పాటు చేస్తారు. తద్వారా వేసవిలో నీరు అవిరయ్యే పరిస్థితి ఉండదు. రిజర్వాయర్ గర్భంపై సోలార్ పలకలు ఏర్పాటు చేయడంవల్ల వేసవిలో నీటి ఆవిరిని నియంత్రించడంతోపాటు భూగర్భ జలాల పెరుగుదలకు కూడా దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ పూర్తయింది. మూడు సంస్థలు ప్రాజెక్టు ప్రతిపాదనలపై జివిఎంసిని సంప్రదించాయి. జివిఎంసి త్వరలోనే రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ కోరనుంది. అన్నీ పూర్తయితే వచ్చే నెలలో ఈ ప్రాజెక్టు టెండర్ దశకు చేకుంటుంది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో సోలార్ విద్యుదుత్పాదన ప్రాజెక్టును చేపడతారు.