బిజినెస్

టాటా మోటార్స్ సరికొత్త ‘ఎక్స్‌ఎల్ సిరీస్’ వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నతరహా వాణిజ్య వాహనాల (ఎస్‌సివి) శ్రేణిని దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ విస్తరించింది.
తమ ఏస్ జిప్, ఏస్ మెగా, ఏస్ రేంజ్ వాహనాల్లో సరికొత్త ‘ఎక్స్‌ఎల్ సిరీస్’ను మంగళవారం మార్కెట్‌కు పరిచయం చేసింది. 15 శాతం అదనపు లోడింగ్ సామర్థ్యంతో ముందుకొచ్చిన వీటిలో ముంబయ ఎక్స్‌షోరూం ప్రకారం ఏస్ జిప్ ఎక్స్‌ఎల్ ధర 3.08 లక్షల రూపాయలు,
ఏస్ మెగా ఎక్స్‌ఎల్ ధర 4.78 లక్షల రూపాయలు, ఏస్ రేంజ్ ఎక్స్‌ఎల్ ధర 4.23 లక్షల రూపాయలుగా ఉన్నాయ. ఏస్ జిప్ ఎక్స్‌ఎల్ లోడింగ్ సామర్థ్యం 600 కిలోలుగా, ఏస్ మెగా ఎక్స్‌ఎల్ లోడింగ్ సామర్థ్యం 1,000 కిలోలుగా, ఏస్ రేంజ్ ఎక్స్‌ఎల్ లోడింగ్ సామర్థ్యం 710 కిలోలుగా ఉంది.
బుధవారం నుంచి ఈ నూతన మినీ ట్రక్కులు దేశవ్యాప్తంగా ఉన్న తమ 1,400 షోరూంలలో అందుబాటులోకి వస్తాయని టాటా మోటార్స్ తెలిపింది.
బిఎస్-4 (్భరత్ స్టేజ్-4) నిబంధనలకు అనుగుణంగా వీటిని తయారు చేసినట్లు స్పష్టం చేసింది. కాగా, 2005లో టాటా ఏస్ శ్రేణి వాహనాలు మార్కెట్‌కు పరిచయమైన దగ్గర్నుంచి ఇప్పటిదాకా 20 లక్షలకుపైగా వాహనాలు అమ్ముడైనట్లు సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది