బిజినెస్

ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభం రూ. 837 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఇండస్‌ఇండ్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 26.5 శాతం పెరిగి 836.55 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 661.38 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 5,302.77 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 4,363.57 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఆదాయం కూడా ఈసారి 26.5 శాతం పెరిగినట్లైంది. ఈ మేరకు మంగళవారం ఇండస్‌ఇండ్ బ్యాంక్ తెలియజేసింది.