బిజినెస్

హైదరాబాద్-కొలంబో మధ్య నాన్‌స్టాప్ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: జిఎమ్‌ఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (జిహెచ్‌ఐఎఎల్) ఆధ్వర్యంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ).. బుధవారం నుంచి హైదరాబాద్-కొలంబో మధ్య నాన్-స్టాప్ విమానాలు ప్రారంభమవుతాయని మంగళవారం ప్రకటించింది. ఈ విమానాలను శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ నడుపుతుందని స్పష్టం చేసింది. వారానికి నాలుగు రోజులు నడుస్తాయని, సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఈ విమాన రాకపోకలుంటాయని పేర్కొంది. కాగా, శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ నూతన సర్వీసులపట్ల జిహెచ్‌ఐఎఎల్ సిఇఒ ఎస్‌జికె కిశోర్ హర్షం వ్యక్తం చేశారు. 16 విదేశీ, 3 స్వదేశీ విమానయాన సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 18 ప్రాంతాలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే 10 దేశీయ విమానయాన సంస్థలు ఇక్కడి నుంచి దేశంలోని 35 ప్రాంతాలకు తమ విమానాలను నడుపుతున్నాయి.