బిజినెస్

ఎంఎస్‌ఎంఈల కోసం జిఎస్‌టి ఇన్ బాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు కోసం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు అవసరమైన సమగ్ర డిజిటల్ ఎంటర్‌ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ)ను అందిస్తామని డెల్‌ఈఎంసి ప్రకటించింది. భారత దేశంలోని 15 నగరాల్లో 30 సొల్యూషన్స్ సెంటర్స్ ద్వారా జిఎస్‌టి ఇన్ ఏ బాక్స్‌తో కూడిన ప్రిప్యాకేజ్డ్ ఎస్‌ఎపిలు ఎంఎస్‌ఎంఈలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కొత్త పన్నుల వ్యస్థ సంస్థల్లో మార్పును తీసుకురావడం తథ్యమని, అయితే ఆ మార్పులకు తగ్గట్లుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సంస్థలు ఎంత వేగంగా అందిపుచ్చుకుంటాయనే దానిపై ఆధారపడి ఉంటుందని డెల్‌ఈఎంసి ఇండియా చానెల్స్ ఉపాధ్యక్షుడు అనిల్ సేథి ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వ్యాపారానికి అంతరాయం లేకుండానే కొత్త పన్నుల వ్యవస్థలోకి మారేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు.