బిజినెస్

ముందు మా బకాయిలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎయిరిండియాను ప్రైవేటీకరించాలన్న ప్రతిపాదన స్వాగతనీయమైనదేనని ఆ సంస్థకు చెందిన పైలెట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకునేముందు తమ వేతన బకాయిల అంశాన్ని పరిష్కరించి ప్రభుత్వం గతంలో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఎయిరిండియా 2012లో పైలెట్ల వేతనాలను కుదించిన విషయం తెలిసిందే. ఈ వేతన సవరణకు ఎయిరిండియాలోని కొంత మంది ఉద్యోగులు అంగీకరించినప్పటికీ వారికి చెల్లించాల్సిన బకాయిలు మాత్రం అప్పటి నుంచి పేరుకుపోయాయి. పైలెట్లు, క్యాబిన్ సిబ్బంది సహా ఎయిరిండియాలో పనిచేస్తున్న 27 వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వం దాదాపు రూ.1,200 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తంలో పైలెట్లకు చెల్లించాల్సిన బకాయిలే దాదాపు 400 కోట్ల రూపాయలు ఉంటాయని సీనియర్ పైలెట్ ఒకరు తెలిపారు.
దాదాపు రెండేళ్ల క్రితం ఎయిండియా పగ్గాలు చేపట్టిన అశ్వనీ లోహానీ, పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ దశలవారీగా చెల్లిస్తామని అప్పట్లో తమ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఎయిరిండియాను పునరుద్ధరించేందుకు ఆ సంస్థను ప్రైవేటీకరించడం సహా ఇతర మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుండటంతో ఈ అంశంపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకునే ముందు తమ వేతన బకాయిలను క్లియర్ చేయాలని పైలెట్లు కోరుతున్నారు. ‘ఎయిరిండియాను ప్రైవేటీకరించబోతున్నారన్న వార్త మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇది ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాం. ఈ పని త్వరగా పూర్తయి సంస్థ సమర్ధవంతమైన యాజమాన్యం చేతిలోకి వెళ్లాలని ఆశిస్తున్నాం. ప్రభుత్వ జోక్యానికి పెద్దగా తావు ఉండని వాతావరణంలో పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఎయిరిండియాను ప్రైవేటీకరించడానికి ముందు తొలుత మా వేతన బకాయిలను చెల్లించాలి’ అని ఇండియన్ పైలెట్స్ గిల్డ్ (ఐపిజి) ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. పెద్ద విమానాలను నడిపే దాదాపు 500 మంది పైలెట్లు ఈ గిల్డ్‌లో సభ్యులుగా ఉన్నారు. కాగా, ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్ (ఐసిపిఎ) ప్రతినిధి కూడా ఇదేవిధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎయిరిండియా మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే ఆ సంస్థ సమర్ధవంతమైన యాజమాన్యం చేతుల్లోకి వెళ్లాలని ఆయన అన్నారు. దాదాపు 1000 మంది సభ్యులను కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న ఐసిపిఎ చిన్న విమానాలను నడిపే పైలెట్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది.