బిజినెస్

భారీగా తగ్గిన టోకు ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: టోకు ద్రవ్యోల్బణం గత నెల జూన్‌లో 0.90 శాతానికి పడిపోయింది. గడచిన ఎనిమిది నెలల్లో ఇదే అత్యంత కనిష్ట స్థాయి గణాంకాలు కావడం గమనార్హం. కాగా, అంతకుముందు నెల మేలో 2.17 శాతంగా నమోదవగా, నిరుడు జూన్‌లో ఇది మైనస్ 0.09 శాతంగా ఉంది. ఇక కూరగాయల ధరలు తగ్గడమే ఈసారి టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో దిగిరావడానికి కారణమని శుక్రవారం వెల్లడైన తాజా గణాంకాల్లో కేంద్రం అభిప్రాయపడింది. ఇప్పటికే విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం (సిపిఐ) గణాంకాలు కూడా భారీగా తగ్గినది తెలిసిందే.