బిజినెస్

దేశీయంగా ప్రభావశీల బ్రాండ్లలో గూగుల్‌దే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: దేశీయంగా అత్యంత ప్రభావవంతమైన బ్రాండ్లలో అమెరికా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రథమ స్థానంలో నిలిచింది. యోగా గురువు రామ్‌దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి, ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియోకు టాప్-10 బ్రాండ్లలో చోటు దక్కింది. గ్లోబల్ రిసెర్చ్ సంస్థ ఇప్సోస్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్.. రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
పతంజలి, ఎస్‌బిఐ నాలుగు, ఐదు స్థానాల్లో ఉండగా, తర్వాతి స్థానాల్లో అమెజాన్ (6), సామ్‌సంగ్ (7), భారతీ ఎయిర్‌టెల్ (8), రిలయన్స్ జియో (9), ఫ్లిప్‌కార్ట్ (10) ఉన్నాయి. అలాగే తర్వాతి స్థానాల్లో స్నాప్‌డీల్, యాపిల్, డెటాల్, కాడ్బరీ, సోనీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మారుతి సుజుకి, గుడ్‌డే, అమూల్ బ్రాండ్లు ఉన్నాయి. మార్కెట్‌ను పతంజలి, జియో సంస్థలు అత్యధికంగా ప్రభావితం చేస్తున్నాయని ఇప్సోస్ తెలిపింది. వాటి ప్రవేశంతో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయని పేర్కొంది.