బిజినెస్

రికార్డు పరుగులకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 14: దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డు పరుగులకు బ్రేక్ పడింది. సూచీలు వరుస లాభాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు. నిజానికి ఉదయం లాభాల్లోనే కదలాడిన సూచీలు.. చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే స్వల్ప నష్టాలకే గురవగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 16.63 పాయింట్లు కోల్పోయి 32,020.75 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 5.35 పాయింట్లు చేజార్చుకుని 9,886.35 వద్ద స్థిరపడింది. కాగా, నిఫ్టీ ఒకానొక దశలో 9,900 మార్కును అధిగమించి, మునుపెన్నడూ లేనివిధంగా 9,913.30 పాయింట్ల గరిష్ఠ స్థాయిని అందుకుంది. ఇకపోతే ఈ వారం సెనె్సక్స్ 660.12 పాయింట్లు, నిఫ్టీ 220.55 పాయింట్ల మేర లాభపడ్డాయి. రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు భారీగా తగ్గడం కలిసొచ్చిందని మార్కెట్ వర్గాలు ట్రేడింగ్ సరళిని విశే్లషిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో కీలక సూచీలన్నీ లాభాల్లోనే ముగియగా, ఐరోపా మార్కెట్లలో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది.