బిజినెస్

విలీనం దిశగా మరిన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: అంతర్జాతీయ స్థాయ బ్యాంకుల సృష్టికి కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మరో 3-4 ప్రపంచ శ్రేణి బ్యాంకుల ఏర్పాటు కోసం.. వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులను ఒక్కటి చేయాలనుకుం టోంది. ఎస్‌బిఐలో దాని అనుబంధ బ్యాంకుల విలీనం నేపథ్యంలో దేశీయంగా ప్రభుత్వరం గ బ్యాంకుల సంఖ్య ప్రస్తుతం 21కి చేరింది. అంతకుముందు 27 ఉండేవి. ఈ క్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర భారీ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మధ్యతరహా, చిన్నతరహా ప్రభుత్వరంగ బ్యాంకులను కలిపే యాలని మోదీ సర్కారు చూస్తోంది. దీంతో దేశంలో ప్రభుత్వరంగ బ్యాం కుల సంఖ్య మరింతగా పడిపోనుం ది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బిఎమ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్‌బిపి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ (ఎస్‌బిటి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బిబిజె)తోపాటు భారతీయ మహిళా బ్యాంక్ (బిఎమ్‌బి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో ఈ ఏడాది ఏప్రిల్ 1న విలీనమైనది తెలిసిందే. ఈ మహా విలీనంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్-50 బ్యాంకుల్లో ఎస్‌బిఐ కూడా చేరింది. విలీనం నేపథ్యంలో ఎస్‌బిఐ ఖాతాదారుల సంఖ్య 37 కోట్లకు పెరగగా, దేశవ్యాప్తంగా దాదాపు 24,000 శాఖలు ఏర్పడ్డాయ. సుమారు 59,000 ఎటిఎమ్‌ల నెట్‌వర్క్ సాధ్యమైంది.
అంతేగాక విలీనానంతర బ్యాంక్ లో డిపాజిట్ల విలువ 26 లక్షల కోట్ల రూపాయలను దాటిపోగా, అడ్వాన్స్‌ల స్థాయి 18.50 లక్షల కోట్ల రూపాయలను మించింది. ఆస్తుల విలువ కూడా 37 లక్షల కోట్ల రూపాయలను తాకింది. కాగా, 2008లో తొలిసారిగా ఎస్‌బిఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర విలీనమైంది. రెండేళ్ల తర్వాత 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ కూడా కలిసిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో ఐదు అనుబంధ బ్యాంకులనూ తనలో ఐక్యం చేసుకోవడానికి ఎస్‌బిఐకి కేంద్ర కేబినెట్ తమ అంగీకారం తెలిపింది. చివరకు కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా తెచ్చిన భారతీయ మహిళా బ్యాంక్‌నూ ఎస్‌బిఐలోనే విలీనం చేసేశారు. మార్చిలో దీనికి సంబంధించిన గ్రీన్‌సిగ్నల్ ఎస్‌బిఐకి మోదీ సర్కారు నుంచి వచ్చింది. అయితే బ్యాంకుల విలీనాలకు ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను మొండి బకాయిలు ప్రశ్నార్థకం చేస్తున్నాయని, ఇలాంటి విలీనాల అవసరం ఎంతైనా ఉందని వాదిస్తోంది. బ్యాంకులు ఎక్కువయ్యేసరికి ఒక బ్యాంక్‌లో రుణం తీసుకుని ఎగవేసినవారే.. మరో బ్యాంక్‌లో రుణం తీసుకుంటూ ప్రజా ధనాన్ని బొక్కేస్తున్నారని చెబుతోంది. కాబట్టి తమ బ్యాంకుల ఏకీకరణ సిద్ధాంతం ముమ్మాటికి సరైనదేనంటూ సమర్థించుకుంటోంది. మరిన్ని బ్యాంకులను ఏకం చేసే పనిలో పడుతోంది.