బిజినెస్

వారం రోజుల్లోగా స్పందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: దేశీయ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల విలువ ప్రమాదకర స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలను దాటిపోయిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికపై వారం రోజుల్లోగా స్పందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)కు సుప్రీం కోర్టు గడువిచ్చింది. ఈ నెల 24లోగా స్పందించాలని చీఫ్ జస్టిస్ జెఎస్ ఖెహర్, జస్టిస్ డివై చంద్రచుద్‌లతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం స్పష్టం చేసింది.
మేక్ ఇన్ ఇండియాకు ఆర్‌బిఐ దన్ను
మరోవైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఆర్‌బిఐ దన్నుగా నిలిచింది. కరెన్సీ సెక్యూరిటీ ఫీచర్ల కోసం కొత్తగా మరో టెండర్‌తో వచ్చిన ఆర్‌బిఐ.. గతంలో జారీ చేసిన రెండు టెండర్లను రద్దు చేసింది. అంతేగాక సెక్యూరిటీ ఫీచర్లు, కరెన్సీ నోట్ల తయారీకి కావాల్సిన ఫైబర్ సరఫరాకు సంబంధించి తయారీ కేంద్రాన్ని భారత్‌లోనే ఏర్పాటు చేయాలని, రెండేళ్లలో అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) ప్రశ్నార్థకం చేస్తున్న విషయం తెలిసిందే.