బిజినెస్

జూట్ మిల్లుకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: చాలాకాలంగా మూతపడి ఉన్న బజరంగ్ జూట్ మిల్లు ఎట్టకేటలకు తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఆంధ్ర రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణతో జరిగిన చర్చలు ఫలించడంతో ఆగస్టు 16 నుంచి ప్రారంభించేందుకు యాజమాన్యం అంగీకరించింది. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. గుంటూరు జిల్లాలో మూతబడిన బజరంగ్ జూట్ మిల్లు గురించి యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులతో సోమవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలోని కార్మిక శాఖ మంత్రి కార్యాలయంలో సమావేశమయ్యారు.
యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులతో చర్చించిన అనంతరం కొన్ని ప్రభుత్వ ఒప్పందాలకు అనుగుణంగా బజరంగ్ జూట్ మిల్లును తెరవాలని నిర్ణయించారు. యాజమాన్యం దీనికి అనుగుణంగా జూలై 21వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ లోపు గతంలో పనిచేసిన కార్మికులు మరల పనిచేసేందుకు పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించింది. జూట్ మిల్లు మరమ్మతుల కోసం యాజమాన్యానికి 10 రోజుల సమయం కేటాయించారు. ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 5 వరకు ముందుగా జూట్ మిల్లులో మొదటి షిప్ట్‌గా ప్రొడక్షన్ ప్రారంభించాలని, సెప్టెంబర్ 6 తేదీ నుండి 19వ తేదీ వరకు సెకండ్ షిఫ్ట్‌లో ప్రొడక్షన్ ప్రారంభించాలని యాజమాన్యానికి మంత్రి సూచించారు. సెప్టెంబర్ 20వ తేదీన జూట్ మిల్లును ప్రభుత్వం సమీక్షిస్తుందని యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు తెలిపారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ కమిషనర్ వరప్రసాద్, అదనపు కమిషనర్ ఆఫ్ లేబర్ సూర్యప్రసాద్, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్, బజరంగ్ జూట్ మిల్లు యాజమాన్యం, టిఎన్‌టియుసి తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.