బిజినెస్

హిందుస్థాన్ మీడియా వెంచర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: హిందుస్థాన్ మీడియా వెంచర్స్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) లో 44.8 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 48.7 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 261.9 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 259.28 కోట్ల రూపాయలుగా ఉంది.
హెచ్‌టి మీడియా లిమిటెడ్
హెచ్‌టి మీడియా లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్) లో గతంతో పోల్చితే 47.21 శాతం పెరిగి 57.78 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 39.25 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 652.18 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 662.43 కోట్ల రూపాయలుగా ఉంది.
టివి18 బ్రాడ్‌కాస్ట్
మీడియా రంగ సంస్థ టివి18 బ్రాడ్‌కాస్ట్ ఏకీకృత నికర నష్టం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 14.28 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో నష్టం 15.72 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 226.72 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 220.31 కోట్ల రూపాయలుగా ఉంది.
క్రిసిల్ రేటింగ్స్
రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 9.3 శాతం పెరిగి 67.25 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 61.51 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 407.30 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 374.97 కోట్ల రూపాయలుగా ఉంది.