బిజినెస్

తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2017-18) తొలి త్రైమాసికం (క్యూ-1)లో వేదాంత గ్రూపునకు చెందిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జడ్‌ఎల్) నికర లాభం 81 శాతం పెరిగి రూ.1,876 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సర (2016-17) తొలి త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.1,037 కోట్లుగా నమోదైంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో తమ సంస్థ మొత్తం ఆదాయం 61 శాతం పెరిగి రూ.5,543 కోట్లకు చేరగా, రాబడులు 79 శాతం పెరిగి రూ.4,961 కోట్లకు చేరుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
19 శాతం తగ్గిన బజాజ్ ఆటో లాభం
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో తమ ఏకీకృత నికర లాభం 19.51 శాతం తగ్గినట్లు బజాజ్ ఆటో గురువారం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో 1,039.70 కోట్లుగా నమోదైన తమ నికర లాభం ఈ ఏడాది వాహన అమ్మకాలు తగ్గడంతో 19.51 శాతం క్షీణించి రూ.836.79 కోట్లకు పడిపోయినట్లు బజాజ్ ఆటో వెల్లడించింది.
కోటక్ మహీంద్రా లాభం 23.10 శాతం వృద్ధి
గత ఏడాది తొలి త్రైమాసికంలో రూ.741.97 కోట్లుగా నమోదైన కోటక్ మహీంద్రా బ్యాంకు నికర లాభం ఈ ఏడాది జూన్ 30వ తేదీతో ముగిసిన తొలి త్రైమాసికంలో 23.10 శాతం వృద్ధిచెంది రూ.912.73 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.5,120.03 కోట్లుగా ఉన్న తమ మొత్తం ఆదాయం ఈ ఏడాది ఇదే కాలంలో రూ.5,562.66 కోట్లకు పెరిగినట్లు కోటక్ మహీంద్రా బ్యాంకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజికి తెలియజేసింది.
12 శాతం పెరిగిన బజాజ్ హోల్డింగ్స్ నికర లాభం
బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (బిహెచ్‌ఐఎల్) నికర లాభం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 12 శాతం వృద్ధిచెంది రూ.636 కోట్లకు చేరుకుంది. గత ఏడాది తొలి త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.566 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో తాము మొత్తం రూ.118 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, ఈ ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.154 కోట్లకు పెరిగినట్లు బిహెచ్‌ఐఎల్ వెల్లడించింది.
ఆర్‌బిఎల్ బ్యాంకు లాభం 45 శాతం వృద్ధి
గత ఏడాది తొలి త్రైమాసికంలో రూ.97.34 కోట్లుగా నమోదైన తమ నికర లాభం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 44.9 శాతం వృద్ధిచెంది రూ.141.02 కోట్లకు పెరిగినట్లు ఆర్‌బిఎల్ బ్యాంకు గురువారం వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.1,031.23 కోట్లుగా ఉన్న తమ మొత్తం రాబడి ఈ ఏడాది ఇదే కాలంలో రూ.1,299.70 కోట్లకు పెరిగినట్లు ఆర్‌బిఎల్ బ్యాంకు ప్రకటించింది.
6 శాతం పెరిగిన డిబి కార్ప్ లాభం
మీడియా రంగ సంస్థ డిబి కార్ప్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.110.11 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ‘దైనిక్ భాస్కర్’ వార్తాపత్రికను ప్రచురిస్తున్న ఈ సంస్థ నికర లాభం గత ఏడాది తొలి త్రైమాసికంలో రూ.103.95 కోట్లుగా నమోదవగా, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 5.92 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో రూ.578.66 కోట్లుగా ఉన్న తమ మొత్తం ఆదాయం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.601.24 కోట్లకు పెరిగినట్లు డిబి కార్ప్ వెల్లడించింది.
ఎన్‌ఐఐటి టెక్ లాభం 79 శాతం వృద్ధి
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో తమ ఏకీకృత నికర లాభం రూ.51.3 కోట్లకు పెరిగినట్లు ఎన్‌ఐఐటి టెక్నాలజీస్ ప్రకటించింది. గత ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.28.6 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ ఏడాది ఇదే కాలంలో 79.5 శాతం వృద్ధి చెందిందని, దీంతో తమ రాబడులు రూ.670.7 కోట్ల నుంచి రూ.708.9 కోట్లకు పెరిగాయని ఆ సంస్థ వెల్లడించింది.
రూ.66 కోట్లకు పడిపోయిన అలెంబిక్ ఫార్మా లాభం
ఔషధ రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఒకటైన అలెంబిక్ ఫార్మా ఏకీకృత నికర లాభం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.66.67 కోట్లకు పడిపోయింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో రూ.103.74 కోట్లుగా నమోదైన తమ నికర లాభం ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 35.73 శాతం తగ్గిందని అలెంబిక్ ఫార్మా ప్రకటించింది.
నెరోలాక్ పెయింట్స్ లాభం 11.31 శాత వృద్ధి
గత ఏడాది తొలి త్రైమాసికంలో రూ.126.50 కోట్లుగా నమోదైన కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ సంస్థ నికర లాభం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 11.31 శాతం వృద్ధిచెంది రూ.140.81 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.1,211.71 కోట్లుగా ఉన్న తమ మొత్తం ఆదాయం ఈ ఏడాది ఇదే కాలంలో 10.91 శాతం పెరిగి రూ.1,343.93 కోట్లకు వృద్ధిచెందినట్లు ఆ సంస్థ వెల్లడించింది.