బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 20: రిలయెన్స్ ఇండస్ట్రీస్, విప్రోలాంటి ప్రముఖ కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో గురువారం దేశీయ మార్కెట్ సూచీలు నష్టాల్లో మునిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో బిఎస్‌ఇ సెనె్సక్స్ ప్రారంభంలోనే వంద పాయింట్ల దాకా లాభపడి 32 వేల పాయింట్ల స్థాయిని దాటినప్పటికీ ఆ తర్వాత పై స్థాయిలో లాభాల స్వీకరణకు దిగడంతో ఆ లాభాలు ఆవిరై పోయి చివరికి 51 పాయింట్ల నష్టంతో 31,904.40 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 26.30 పాయింట్లు నష్టపోయి 9,873. 30 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రారంభంలో ప్రకటించిన కొన్ని త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో మదుపరులు అమ్మకాలకే మొగ్గు చూపడమే సూచీలు నష్టాల్లో ముగియడానికి కారణమని విశే్లషకులు అభిప్రాయ పడుతున్నారు. త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సైతం ఒత్తిడికి గురయింది. అలాగే బజాజ్ ఆటో ఫలితాలు సైతం మార్కెట్ అంచనాల మేరకు లేకపోవడం మదుపరులు ఆచితూచి వ్యవహరించడానికి కారణమైంది. టాటా స్టీల్ షేరు 2.64 శాతం పడిపోగా, ఎన్‌టిపిసి, ఇన్ఫోసిస్ షేర్లు సైతం 1 శాతానికి పైగా పడిపోయాయి. ఐటి సంస్థ మైండ్ ట్రీ షేరు నిరాశాజనక త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో 4.45 శాతం మేర పడిపోయింది.