బిజినెస్

పన్నులు ఎగ్గొడితే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారుల కోసం కల్పించిన ఆన్‌లైన్ విధానాన్ని ఎవరైనా వ్యాపారవేత్తలు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ వి అనిల్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, రిజిస్ట్రేన్లను ఒకే రోజులో చేస్తున్నామని గుర్తు చేశారు. వే బిల్లులు, సి-్ఫరంలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని, వ్యాపారులు ఆన్‌లైన్‌లోనే పన్నులను చెల్లించవచ్చని తెలిపారు. వే బిల్లులు పెద్ద ఎత్తున వ్యాపారులు వినియోగిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును మాత్రం ఎగ్గొడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కమిషనర్ పేర్కొన్నారు. కొంతమంది బోగస్ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారని తద్వారా ఖజానాకు గండిపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా డీలర్లంతా తమ రిటర్న్‌లను ఈ నెల 15 వరకు సమర్పించాలని సూచించారు. ఎవరైనా రిటర్న్స్‌ను సమర్పించకపోతే క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యాపారులంతా ప్రభుత్వానికి సహకరించాలని, బంగారు తెలంగాణకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.