బిజినెస్

హెచ్‌పిసిఎల్‌లో ప్రభుత్వ వాటాను ఒఎన్‌జిసికి అమ్మేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)లో మొత్తం ప్రభుత్వ వాటాను ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసి కొనేస్తోంది. ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ (సిసిఇఎ) దీనికి సంబంధించి ఈ నెల 19న ఆమోదం తెలిపిందని లోక్‌సభకు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తెలియజేశారు. ఓ సుమోటు స్టేట్‌మెంట్ ఇచ్చిన ప్రధాన్.. హెచ్‌పిసిఎల్‌లో కేంద్ర ప్రభుత్వానికి 51.11 శాతం వాటా ఉందని, దాన్ని ఒఎన్‌జిసికి అమ్మేస్తున్నామని చెప్పారు. ఈ వాటా అమ్మకం తర్వాత హెచ్‌పిసిఎల్.. భారతీయ మూడో అతిపెద్ద చమురు శుద్ధి సంస్థగా ఆవిర్భవిస్తుందని అన్నారు. 62 మిలియన్ టన్నులతో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెండో స్థానంలో ఉండగా, దేశీయ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) 69.2 మిలియన్ టన్నులతో మొదటి స్థానంలో ఉంది. ఈ క్రమంలో 40 మిలియన్ టన్నులతో హెచ్‌పిసిఎల్ మూడో స్థానంలోకి రానుంది. హెచ్‌పిసిఎల్ ప్రస్తుత చమురు శుద్ధి సామర్థ్యం 24.8 మిలియన్ టన్నులు, ఒఎన్‌జిసి అనుబంధ సంస్థ మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎమ్‌ఆర్‌పిఎల్) చమురు శుద్ధి సామర్థ్యం 15.1 మిలియన్ టన్నులు. ఒఎన్‌జిసి చేతికి హెచ్‌పిసిఎల్ వస్తే ఈ మొత్తం సామర్థ్యం 39.9 మిలియన్ టన్నులు అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం చమురు శుద్ధి కేంద్రాన్ని విస్తరించే యోచనలో ఉన్న హెచ్‌పిసిఎల్.. రాజస్థాన్‌లో 9 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఓ యూనిట్‌ను నెలకొల్పాలని భావిస్తోంది. దీంతో హెచ్‌పిసిఎల్ చమురు శుద్ధి సామర్థ్యం 50 మిలియన్ టన్నులను మించిపోనుంది. ఎమ్‌ఆర్‌పిఎల్‌లో ఇప్పటికే హెచ్‌పిసిఎల్‌కు 16.96 శాతం వాటా ఉన్నది తెలిసిందే. ఒఎన్‌జిసికి 71.63 శాతం వాటా ఉండగా, 2013 మార్చిలో ఎవి బిర్లా గ్రూప్ నుంచి ఎమ్‌ఆర్‌పిఎల్‌ను ఒఎన్‌జిసి సొంతం చేసుకుంది. కాగా, హెచ్‌పిసిఎల్ వాటాను ఒఎన్‌జిసి కొనుగోలు చేయడం వల్ల చమురు రంగంలో ఒఎన్‌జిసి అన్నివిధాలా బలపడుతుందని, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ఒడిదుడుకుల ప్రభావం నుంచి తప్పించుకుంటుందని, భారీ పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోగలదని, ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోగలదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చికల్లా ఈ లావాదేవీని పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు పార్లమెంట్ బయట విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాన్ చెప్పారు. లావాదేవీ అనంతరం దేశీయ చమురు రిటైల్ మార్కెట్‌లో హెచ్‌పిసిఎల్‌కు 25 శాతం వాటా ఉంటుందని, దాని స్వతంత్ర గుర్తింపు కూడా కొనసాగుతుందని ప్రధాన్ తెలిపారు. హెచ్‌పిసిఎల్‌కు ప్రత్యేకంగా బోర్డు ఉంటుందని, బ్రాండ్ ఐడెంటిటీ ఉంటుందని, ఇప్పట్లాగే ఓ ప్రభుత్వరంగ సంస్థగానే ఉంటుందని అన్నారు.
ఇదిలావుంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఈ లావాదేవీని పర్యవేక్షిస్తుంది. త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటుంది. కాగా, హెచ్‌పిసిఎల్‌లో కేంద్ర ప్రభుత్వానికి 51.11 శాతం వాటా ఉండగా, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది 28,800 కోట్ల రూపాయలతో సమానం. మరోవైపు చమురు రంగంలో మరిన్ని ఏకీకరణలకు అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్నది తెలిసిందే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లోకి కొన్ని ప్రభుత్వరంగ చమురు సంస్థలను తీసుకెళ్ళాలని చూస్తున్న కేంద్రం.. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థే అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్)ను మరో ప్రభుత్వరంగ సంస్థలో విలీనం చేయాలని పావులు కదుపుతోంది.