బిజినెస్

పేమెంట్ బ్యాంక్ సేవలను విస్తరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 28: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 1,542 తపాలా కార్యాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎపి సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె బాలసుబ్రహ్మణ్యన్ చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా అధార్ కార్డు అవసరమైన వారి వివరాలు కంప్యూటరీకరించి, యుఐడి ఇస్తారన్నారు. అలాగే ఆధార్ కార్డుల్లో పేర్లు తప్పుగా ప్రచురణ జరిగినా సరిచేస్తామన్నారు. ఏడాదిలో సుమారు 3 లక్షల మందికి ఎపి లో తపాలా కార్యాలయాల ద్వారా ఆధార్ కార్డులు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సీనియర్ సూపరింటెండెంట్ కార్యాలయం ఆవరణలో ఆధార్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. తపాలా కార్యాలయాల్లో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏర్పాటుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అనుమతి మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 తపాలా కార్యాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్న బాలసుబ్ర హ్మణ్యన్.. ప్రస్తుతం విశాఖపట్టణం, చిత్తూరు, విజయవాడలో కార్యాలయం పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా పాస్‌పోర్టు సేవా కేంద్రాలను కడప, కర్నూలు, నెల్లూరులో త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రానున్న రెండు మూడు మాసాల్లో అనంతపురం, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, ఒంగోలులో ప్రారంభిస్తామని చెప్పారు. కాగా, ఎపి పోస్టల్ సర్కిల్ పరిధిలోని 3.10 కోట్ల ఖాతాదారుల అకౌంట్లను కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ (సిబిఎస్) విధానం ద్వారా నడుపుతున్నామని బాలసుబ్రహ్మణ్యన్ వివరించారు. ఈ ఏడాది 60 లక్షల అకౌంట్లను ఎపి సర్కిల్‌లో ప్రా రంభిస్తామన్నారు. రాష్ట్రంలో 59 పోస టల్ ఎటిఎంల ద్వారా 2.58 లక్షల మంది తపాలా సేవలను వినియోగించుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో సు కన్య సమృద్ధి యోజనకు మంచి ఆదరణ లభించిందని, 4.65 లక్షల మంది భాగస్వామ్యులుగా ఉన్నారన్నారు.

చిత్రం.. భీమవరంలో ఆధార్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎపి సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బాలసుబ్రహ్మణ్యన్