బిజినెస్

వ్యవసాయ అనుబంధ రంగంలోకి ఐటిసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 28: వివిధ రంగాల్లో ఇప్పటికే విస్తరించిన ఐటిసి కొత్తగా పండ్లు, కూరగాయలు లాంటి వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నట్లు ఐటిసి చైర్మన్ వైసి దేవేశ్వర్ చెప్పారు. అలాగే ఔషధ మొక్కల సాగు రంగంలో కూడా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నట్లు శుక్రవారం ఇక్కడ జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ ఆయన అన్నారు. సంస్థ ఇప్పటికే ఇందుకోసం వౌలిక సదుపాయాలను సృష్టించడంలో నిమగ్నమైందని, సప్లై చైన్‌లో పెట్టుబడులు కూడా పెడుతోందని కూడా తెలిపారు.
కాగా, జిఎస్‌టితో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని ఆధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని, రిటైల్ చైన్‌పై దీని ప్రభావం తక్కువగా ఉందని, టోకు వ్యాపారం కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని ఐటిసి సిఈఓ సంజయ్ పురి చెప్పారు. జిఎస్‌టి వల్ల రెవిన్యూలో పెద్దగా నష్టం రానప్పటికీ ఆటా(గోధుమ పిండి)లాంటి కొన్ని బ్రాండెడ్ ఉత్పత్తులపై ద్వంద్వ పన్నుల కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ పరిశ్రమ మరిన్ని ఉద్యోగాలను సృష్టించాలంటే ఈ రంగంపై నిర్ణీత వడ్డీ రేట్లు ఉండడం అవసరమని ఆయన అభిప్రాయ పడ్డారు.