బిజినెస్

ఔషధ ఎగుమతులలో దూసుకుపోతున్న విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: ఔషధ ఎగుమతులలో విశాఖపట్నం దూసుకుపోతోందని, గడిచిన మూడేళ్ల కాలంలో విశాఖపట్నంలోని ఫార్మా రంగం ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోందని కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాడవీయ వెల్లడించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో విశాఖ నుంచి 1,04,679.68 కోట్ల రూపాయల విలువైన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతి జరిగినట్లు ఆయన తెలిపారు. రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖపట్నంలోని ఫార్మా రంగంపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు. అలాగే గడిచిన మూడేళ్ల వ్యవధిలో కరువు సహాయక చర్యల కోసం ఆంధ్రాకు 1,190.21 కోట్ల రూపాయల నిధులను కేంద్రం విడుదల చేసినట్లు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఎస్‌ఎస్ అహ్లూవాలియా తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి సమాధానం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలపై కేంద్ర బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి 2014-15 ఆర్థిక సంవత్సరంలో 237.51 కోట్ల రూపాయలు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 433.77 కోట్ల రూపాయలు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో 518 కోట్ల రూపాయలను కేంద్ర జాతీయ విపత్తు నిధి నుంచి రాష్ట్రానికి విడుదల చేసిందని చెప్పారు.