బిజినెస్

ఒక్కటైన స్కూట్ ఎయిర్‌లైన్స్-టైగర్‌ఎయిర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: ‘నేటి నుంచి టైగర్‌ఎయిర్ విమానాలన్నీ స్కూట్ ఎయిర్‌లైన్స్ ఆధ్వర్యంలో నడుస్తాయి.’ అని సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ అయిన స్కూ ట్ ఎయిర్‌లైన్స్ శుక్రవారం ఇక్కడ తెలిపింది. స్కూట్ ఎయిర్‌లైన్స్ ఇండియా అధిపతి భరత్ మహదేవన్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక్కటైపోవాలన్న ఆకాంక్షను 9 నెలల క్రితం స్కూట్, టైగర్‌ఎయిర్ బ్రాండ్లు వ్యక్తం చేశాయని, దానికి అనుగుణంగానే ఇకపై టైగర్‌ఎయిర్ విమానాలు స్కూట్ బ్రాండ్‌లో నడుస్తాయని చెప్పారు. టైగర్‌ఎయిర్ విమానం చివరిసారిగా తిరుచిరాపల్లి-సింగపూర్ మధ్య ప్రయాణించిందని, ఈ నెల 24 రాత్రి 11:05 నిమిషాలకు తిరుచిరాపల్లి నుంచి సింగపూర్‌కు బయలుదేరిందని తెలిపారు. ఇదిలావుంటే ఈ విలీనం సందర్భంగా స్కూట్ ఎయిర్‌లైన్స్ పలు ఆఫర్లను తమ ప్రయాణీకులకు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి సింగపూర్, ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాల టిక్కెట్ల ధరలపై ఈ ఆఫర్లను తీసుకొచ్చింది. ‘నిరుడు భారత్‌లో మా విమాన సేవలను విజయవంతంగా ప్రారంభించాం. ఇప్పు డు టైగర్‌ఎయిర్ కలయికతో స్కూట్ సేవలు మరింత విస్తృతం అయ్యాయి.’ అని మహదేవన్ అన్నారు. కాగా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, తిరుచిరాపల్లి, లక్నోల నుంచి టైగర్‌ఎయిర్ బ్రాండ్‌లో కాకుండా ఇక స్కూట్ బ్రాండ్‌లో విమాన సేవలు ఉంటాయని చెప్పారు. టైగర్‌ఎయిర్ విలీనం తర్వాత స్కూట్ ఎయిర్‌లైన్స్ ఒక వారంలో నడిపే విమానాల సంఖ్య 50కి చేరిందని, ఇందులో 8 విమానాలు భారత్, సింగపూర్ మధ్య తిరుగుతాయని వివరించారు. మరోవైపు రాజస్థాన్ పర్యాటక అందాలకు మరింత గుర్తింపు వచ్చేలా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో స్కూట్ ఎయిర్‌లైన్స్ చర్చలు జరుపుతోందని మహదేవన్ తెలిపారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒప్పందం చేసుకునే వీలుందన్నారు.