బిజినెస్

పొగాకు రైతులకు వడ్డీలేని రుణాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 9: పొగాకు రైతుల సంక్షేమార్థం వివిధ పథకాల కింద అందించే వడ్డీలేని రుణాలను ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పొగాకు బోర్డు కార్యదర్శి సిఎస్‌ఎస్ పట్నాయక్ తెలిపారు. పొగాకు రైతుల కుమార్తెల వివాహాలకు ఇచ్చే 25 వేల రూపాయల రుణాన్ని 50 వేలకు, విద్యా రుణాలను 25 నుంచి 50 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతిన్న రైతులకు ఇచ్చే రుణాలను 25 వేల నుంచి 50 వేల రూపాయలకు, పాక్షికంగా దెబ్బతిన్న రైతులకు ఇచ్చే 10 వేల రూపాయల రుణాన్ని 20 వేల రూపాయలకు, అగ్ని ప్రమాదాల వల్ల నష్టపోయిన రైతులకు 25 వేల నుండి 50 వేల రూపాయలకు వడ్డీలేని రుణాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ రుణాలను 3 విడతలుగా మూడేళ్ల కాలంలో చెల్లించేలా వీలు కల్పిస్తున్నామన్నారు.