బిజినెస్

షేర్ మార్కెట్ లావాదేవీలకూ ఆధార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఇప్పటి వరకూ ప్రతిదానికీ ఆధార్‌ను ముడిపెడుతూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తాజాగా షేర్ మార్కెట్ లావాదేవీలకు ఆధార్‌ను ముడిపెట్టబోతోంది. షేర్లు కొనాలన్నా, మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలన్నా ఆధార్‌ను తప్పసిసరి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ లావాదేవీల్లో ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం త్వరలోనే ప్రకటన చేసే అకాశం కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్ల లావాదేవీల ద్వారా నల్లధనాన్నిన తెల్లధనంగా మార్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అరికట్టే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆర్థిక లావాదేవీలకు ఆధార్‌ను ముడిపెట్టడం ద్వారానే ఇలాంటి అనైతిక కృత్యాలను అరికట్టడం సాధ్యం కాదని నిపుణలు భావిస్తున్నారు.