బిజినెస్

టాప్-50లో ఎస్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఐదు అసోసియేట్ బ్యాంకుల విలీనాన్ని ధృవీకరిస్తూ లోక్‌సభ గురువారం ఓ బిల్లును ఆమోదించింది. ఈ విలీనం వల్ల ఎస్‌బిఐ మూల ధనం మరింత పెరుగుతుందని, రుణాల లభ్యతకు అవకాశం ఉంటుందని ఆర్థికశాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ఈ విలీనంతో ప్రపంచంలోనే అతిపెద్ద 50 బ్యాంకుల జాబితాలోకి ఎస్‌బిఐ చేరుకుందని 45వ స్థానంలో కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. మూలధన విస్తృతి పెరగడమే కాకుండా రుణాలు ఇచ్చే సామర్ధ్యం కూడా ఎస్‌బిఐకు పెరుగుతుందని, దీని వల్ల మ్యూచువల్స్ ఫండ్స్ వంటిని చిన్న బ్యాంకులకు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. గత రెండేళ్లలో 29వేల కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని వాటిలో 25 శాతం జీరో బ్యాలెన్స్ ఖాతాలేనని చెప్పారు. అలాగే వ్యవసాయ రుణాలు కూడా 3.5 లక్షల కోట్ల నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరంలో 10.65 లక్షల కోట్లకు చేరుకున్నాయని మంత్రి తెలిపారు. దేశంలోని ప్రతి వ్యక్తికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలన్నదే తమ లక్ష్యమన్న మంత్రి‘ఏ బ్యాంకు బ్రాంచిని మూసివేయడం ఉండదు. అవసరమైన చోట వాటిని తెరుస్తాం’అని వెల్లడించారు. ఈ విలీనం వల్ల ఎస్‌బిఐ ఆపరేషన్ల పరిధి మరింత విస్తరిస్తుందని అంతేకాకుండా ప్రైవేటు బ్యాంకులకు సవాల్‌గా ఇది పనిచేయగలుతుందని గంగ్వార్ స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎస్‌బిఐ పనిచేస్తుంది కాబట్టి దీని సేవలను సద్వినియోగం చేసుకోవడానికి మెజారిటీ ప్రజలు ముందుకొచ్చే అవకాశం ఉందన్నారు.ఈ విలీనం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రజలకు లబ్ధి చేకూర్చాలన్న ఆశమేనని వెల్లడించిన ఆయన‘ఎంత మేరకు ప్రజలకు మేలుజరుగుతుందన్నదానిపైనే దృష్టి పెట్టాం’అని పేర్కొన్నారు. ఈవిలీనంతో ఎస్‌బిఐ ఖాతాదారుల సంఖ్య 37 కోట్లకు పెరిగిందని అలాగే బ్యాంకు బ్రాంచీలు కూడా 24వేలకు పైగా ఉన్నాయని, 59 వేలకు పైగా ఎటిఎంలు ఎస్‌బిఐ పరిధిలోకి వచ్చాయని మంత్రి వివరించారు. విలీనం తరువాత ఎస్‌బిఐ డిపాజిట్లు కూడా 26 లక్షల కోట్లకు చేరుకున్నాయని, అడ్వాన్సులు కుడా 18.50 లక్షల కోట్లకు పెరిగాయన్నారు.