బిజినెస్

ఒక్క పైసా కూడా రద్దు చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: కార్పొరేట్ రుణాలను నయాపైస కూడా ప్రభుత్వం రద్దు చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. శుక్రవారం లోక్‌సభలో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకుని ప్రతిపక్షాలు మాట్లాడాలని సూచించారు. రుణాల రద్దు అనేది బ్యాంకులు తీసుకునే వాణిజ్యపరమైన నిర్ణయమని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండబోదన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి కనీసం వ్యవసాయ రుణాలను కూడా రద్దు చేయలేదని గుర్తుచేశారు. అలాంటిది కార్పొరేట్ల రుణాలను ఎలా రద్దు చేస్తామని ప్రశ్నించారు. బ్యాంకింగ్ రంగంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికినే మొండి బకాయలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) ప్రశ్నార్థకం చేస్తున్నది తెలిసిందే.