బిజినెస్

నష్టాల ఊబిలో ఆర్‌కామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశీయ ప్రైవేట్ రంగ టెలికామ్ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ఏకంగా 1,210 కోట్ల రూపాయల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఈ అనిల్ అంబానీ సారథ్యంలోని సంస్థ.. ఇలా నష్టాల పాలవడం ఇది వరుసగా మూడో త్రైమాసికం. తన సోదరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికామ్ రంగంలో సమీకరణాలు పూర్తిగా తలికిందులైనది తెలిసిందే. నిరుడు సెప్టెంబర్‌లో 4జి సేవలను జియో ప్రారంభించగా, దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 31వరకు ఉచితంగానే అందించింది. దీంతో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ వంటి దిగ్గజ సంస్థలతోపాటు రిలయన్స్ కమ్యూనికేషన్స్ మిగతా అన్ని సంస్థల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఎయిర్‌టెల్ లాభం నేల చూపులు చూస్తుండగా, ఐడియా కూడా నష్టాల్లోకి జారుకుంది. ఈ క్రమంలో నిరుడు అక్టోబర్ నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు నష్టాలు తప్పట్లేదు. ఇకపోతే గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సంస్థ లాభం 90 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం విషయానికొస్తే.. 33 శాతం పడిపోయింది. ఈసారి 3,591 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 5,361 కోట్ల రూపాయలుగా ఉందని శనివారం ఓ ప్రకటనలో ఆర్‌కామ్ తెలిపింది. గడచిన 20 ఏళ్లకుపైగా కాలంలో భారతీయ టెలికామ్ పరిశ్రమ ఆదాయం ఇంత దారుణంగా పడిపోవడం ఇదే తొలిసారి అని ప్రకటనలో ఆర్‌కామ్ పేర్కొంది. గతంలో దీనంతటికి కారణం జియోనేనని ఆర్‌కామ్ బాహాటంగానే విమర్శించినది తెలిసిందే. కాగా, 45,000 కోట్ల రూపాయల రుణ భారాన్ని మోస్తున్న ఆర్‌కామ్‌కు డిసెంబర్ 31లోగా ఆ భారాన్ని తగ్గించుకునేందుకు బ్యాంకులు సమయం ఇచ్చినది తెలిసిందే. దీంతో ఆస్తుల అమ్మకాలు, సంస్థలో విలీనాలకు అనిల్ అంబానీ తెరతీయగా, ఈ నెలాఖర్లోగా సిస్టెమా శ్యామ్ టెలికామ్ విలీనం పూర్తవుతుందని, ఎయిర్‌సెల్‌తో తమ మొబైల్ వ్యాపారం కూడా విలీనం అయితే రుణ భారం 14,000 కోట్ల రూపాయల మేర తగ్గవచ్చని అనిల్ అంబానీ ఆశిస్తున్నారు. అలాగే బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్‌కు టవర్ వ్యాపారం విక్రయం ద్వారా మరో 11,000 కోట్ల రూపాయల అప్పులు తీరుతాయని భావిస్తున్నారు. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ ట్రేడింగ్‌లో ఆర్‌కామ్ షేర్ విలువ గురువారం ముగింపుతో చూస్తే 2.12 శాతం పడిపోయి 20.75 రూపాయల వద్ద స్థిరపడింది.