బిజినెస్

ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిఎమ్‌ఆర్ ఇన్‌ఫ్రా
నష్టం రూ. 136.6 కోట్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 13: జిఎమ్‌ఆర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ ఏకీకృత నష్టం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 136.60 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 235 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 3,159 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,239 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
ముత్తూట్ ఫైనాన్స్
నికర లాభం రూ. 351 కోట్లు
ముత్తూట్ ఫైనాన్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో చూస్తే 30 శాతం పెరిగి 351 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో సంస్థ లాభం 270 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,399 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయనసారి 1,301 కోట్ల రూపాయలుగా ఉంది.
తగ్గిన జెఎస్‌పిఎల్ నష్టం
జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జెఎస్‌పిఎల్) ఏకీకృత నికర నష్టం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 420.4 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 1,238 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 6,126.6 కోట్ల రూపాయలుగా, పోయినసారి 5,124.7 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలియజేసింది.
17 శాతం పడిపోయన
జిఎస్‌కె లాభం
గ్లోక్సోస్మిత్‌క్లయన్ (జిఎస్‌కె) కన్స్యూమర్ హెల్త్‌కేర్ స్టాండలోన్ నికర లాభం గతంతో పోల్చితే 17.6 శాతం పడిపోయ ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 132.23 కోట్ల రూపాయలుగా నమోదైంది. పోయనసారి సంస్థ లాభం 160.61 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 1,101.57 కోట్ల రూపాయలుగా, నిరుడు 1,118.56 కోట్ల రూపాయలుగా ఉంది.
స్వల్పంగా పెరిగిన టివిఎస్ లాభం
దేశీయ ఆటో రంగ సంస్థ టివిఎస్ మోటార్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 6.8 శాతం పెరిగి 129.47 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 121.25 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. ఇక ఆదాయం ఈసారి 3,799.81 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 3,184.35 కోట్ల రూపాయలుగా ఉంది.
ఆరింతలు ఎగిసిన
టిటికె ప్రెస్టీజ్ నికర లాభం
ప్రముఖ గృహోపకరణాల తయారీదారు టిటికె ప్రెస్టీజ్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే ఆరింతలు ఎగిసి 135.62 కోట్ల రూపాయలుగా నమోదైంది. పోయనసారి సంస్థ లాభం 21.75 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 385.64 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయనసారి 380.80 కోట్ల రూపాయలుగా ఉంది.
ఐజిఎల్ లాభం రూ. 161 కోట్లు
ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజిఎల్) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 9 శాతం పెరిగి 161 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 147.72 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదా యం ఈసారి 1,157 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 995 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
టిజిబిఎల్ లాభం 13 శాతం వృద్ధి
టాటా గ్లోబల్ బేవరేజెస్ లిమిటెడ్ (టిజిబిఎల్) ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 13.20 శాతం పెరిగి 142 కోట్ల రూపాయలుగా నమోదైంది. పోయన సారి సంస్థ లాభం 126.29 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,704.42 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయనసారి 1,735.46 కోట్ల రూపాయలుగా ఉంది.