బిజినెస్

మిగులు విద్యుత్ దిశగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే మిగులు విద్యుత్ వెలుగులు రానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం (కెటిపిఎస్) 7వ దశ ప్లాంట్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి కానున్నాయి. అలాగే ఇదే జిల్లా మణుగూరులో నిర్మిస్తున్న 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వచ్చే ఏడాది డిసెంబర్‌లో నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పాదన ప్రారంభించనుంది. పర్యావరణ అనుమతులు ఆలస్యంగా రావడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల వల్ల ముందు నిర్ణయించిన ప్రకారం భద్రాద్రి ప్లాంట్ పని పూర్తి కాలేదు. దీంతో వచ్చే ఏడాది డిసెంబర్‌లో పనులు పూర్తి చేసి విద్యుదుత్పత్తిని ప్రారంభించాలని రాష్ట్ర విద్యుదు త్పత్తి సంస్థ జెన్‌కో కొత్త గడువు పెట్టుకుంది. భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు 2015 మార్చి 21న జెన్‌కో, బిహెచ్‌ఈఎల్ మధ్య ఒప్పందం జరిగింది. 7,290.60 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ విద్యుత్ కేంద్రం గత మార్చి 31లోపే పూర్తి కావాల్సి ఉంది. సబ్ క్రిటికల్ టెక్నాలజీపై కేంద్ర విద్యుత్ శాఖ ఆంక్షలు ఉండడంతో పర్యావరణ అనుమతులు ఆలస్యంగా లభించాయి. ఈ అవాంతరాలను అధిగమించి గత ఏప్రిల్ 1న పనులను ప్రారంభించగా, ఇప్పటివరకు 5 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. కాగా, ప్రాజెక్టు అంచనా వ్యయం 7,290 కోట్ల రూపాయల్లో 5,044 కోట్ల రూపాయలను ప్లాంట్ నిర్మాణానికి బిహెచ్‌ఈఎల్‌కు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే యంత్రాలు, పరికరాల కోసం జెన్‌కో 1,975.25 కోట్ల రూపాయను బిహెచ్‌ఈఎల్‌కు చెల్లించింది. మరోవైపు కొత్తగూడెం పవర్‌ప్లాంట్.. అధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న తొలి ప్లాంట్ కావడంతో మూడేళ్లలో నిర్మించి రికార్డు సృష్టించాలని జెన్‌కో లక్ష్యంగా పెట్టుకుంది. 5,548 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్లాంట్ నిర్మించేందుకు దీన్ని కూడా బిహెచ్‌ఈఎల్‌తోనే జెన్‌కో ఒప్పందం కుదుర్చుకుంది. 2015 జనవరి 1 నుంచి 24 నెలల్లోపు ఈ ప్లాంట్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,634 కోట్ల రూపాయల వ్యయంతో 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. బాయిలర్ పనులు 90 శాతం పూర్తవగా, టర్బన్, జనరేటర్, కోల్ ప్లాంట్ పనులు సైతం దాదాపు సగానికిపైగా పూర్తయ్యాయి. దీంతో ఈ ఏడాది చివరి నాటికి బాయిలర్‌ను లైటప్ చేయాలని జెన్కో నిర్ణయించింది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే, వచ్చే మార్చిలోగా నిర్మాణం పూర్తిచేసి విద్యుదుత్పత్తి ప్రారంభించాలని జెన్కో పట్టుదలతో ఉంది. మొత్తానికి ఈ రెండు ప్లాంట్లు అందుబాటులోకి వస్తే తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించనుంది.