బిజినెస్

సత్తా చాటిన ట్రిపుల్‌ఐటి-హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్‌ఐటి లేదా ఐఐఐటి) హైదరాబాద్ గ్రాడ్యుయేట్లకు లక్షల్లో సాలరీలున్న జాబ్ ఆఫర్లు వచ్చాయ. 116 సంస్థలు చేపట్టిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో ఇక్కడి విద్యార్థులందరికీ ప్లేస్‌మెంట్లు రాగా, బిటెక్ విద్యార్థుల వార్షిక వేతన ఆఫర్లు 13.4 లక్షల నుంచి 18.8 లక్షల రూపాయల మధ్య ఉన్నాయ.
ఎంటెక్ విద్యార్థులకూ సగటున 14 లక్షల నుంచి 17.7 లక్షల రూపాయల మధ్య వార్షిక జీతాలున్న ఉద్యోగావ కాశాలు లభించాయ. ఈ మేరకు ఓ ప్రకటనలో ఆదివారం ఇనిస్టిట్యూట్ తెలియజేసింది. ప్రముఖ సంస్థల నుంచి తమ విద్యార్థులకు ఇంతింత వేతనాలతో కూడిన ఉద్యోగా లు రావడంపట్ల ఆనందం వ్యక్తం చేసింది.
కాగా, శనివారం ఐఐఐటి-హైదరాబాద్ 16వ స్నాతకో త్సవ వేడుకలు జరిగాయ. ఈ సందర్భంగా 473 మందికి డిగ్రీలు ప్రదానం చేయగా, వీరిలో రికార్డు స్థాయలో 84 మంది రిసెర్చ్ విద్యార్థులు, 16 మంది పిహెచ్‌డి విద్యార్థు లున్నారు. ఐఐఐటి-హైదరాబాద్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సిఇఒ జి వి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.