బిజినెస్

లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 14: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. గత వారం వరుస నష్టాల్లో కదలాడిన సూచీలు.. సోమవారం తిరిగి లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 235.44 పాయింట్లు పుంజుకుని 31,449.03 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 83.35 పాయింట్లు పెరిగి 9,794.15 వద్ద స్థిరపడింది. అమెరికా-ఉత్తర కొరియా మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు శాంతిస్తుండటం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ప్రపంచ దేశాలను, ముఖ్యంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం ఏర్పడుతోందని చైనా అధ్యక్షుడు ఇరు దేశాలను కోరడంతో ఉద్రిక్తకర పరిస్థితులు చల్లబడ్డాయి. కాగా, రియల్టీ, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, విద్యుత్ రంగాల షేర్లు లాభపడితే, ఐటి, టెక్నాలజీ రంగాల షేర్లు నష్టపోయాయి.
ప్రభుత్వ బాండ్లకు విశేష స్పందన
మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) ఈ-బిడ్ ప్లాట్‌ఫామ్‌పై సోమవారం నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ప్రభుత్వ రుణ సెక్యూరిటీలకు విదేశీ మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలం జరిగింది. ఈ సందర్భంగా 5,481 కోట్ల రూపాయల విలువైన బాండ్లకు 7,116 కోట్ల రూపాయల విలువైన దరఖాస్తులు వచ్చాయి.