బిజినెస్

స్వల్పంగా పెరిగిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే స్వల్పంగా పెరిగి 1,248.10 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 1,140.03 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సంస్థ సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. ఆదాయం ఈసారి 11,222.17 కోట్ల రూపాయలుగా, పోయినసారి 10,373.47 కోట్ల రూపాయలుగా ఉంది. భారతీయ బిల్డింగ్ మెటీరియల్స్ తయారీదారైన గ్రాసిమ్ ఇండస్ట్రీస్.. 1948లో తొలుత టెక్స్‌టైల్ తయారీదారుగా తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ముంబయ ప్రధాన కేంద్రంగా ఇది తన వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది.