బిజినెస్

అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు (జిఇఎస్)కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ సదస్సుకు హాజరు కానుండటంతో దీనిని ‘పెద్ద ఈవెంట్’గా పరిగణిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌ను భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహిచనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అమెరికా ప్రతినిధి బృందానికి ఇవాంకా ట్రంప్ సారథ్యం వహించనుంది. నవంబర్ 28వ తేదీ నుంచి జరిగే ఈ ‘పెద్ద ఈవెంట్’ లో భారత ప్రభుత్వానికి చెందిన ‘అత్యంత ప్రముఖులు’ పాల్గొనబోతున్నారని న్యూఢిల్లీలో అమెరికా అధికారి ఒకరు ధ్రువీకరించారు. అయితే ఈ సదస్సుకు మోదీ హాజరవుతారా? లేదా? అనే విషయాన్ని ధ్రువీకరించేందుకు ఆయన నిరాకరింస్తూ, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నారు. అయితే ఈ హై-ప్రొఫైల్ ఈవెంట్‌కు మోదీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ పారిశ్రామిక సదస్సు-2017కు అమెరికా ప్రతినిధి బృంద నాయకురాలిగా ఇవాంకా వస్తారని ఎదురు చూస్తున్నామని మోదీ గత వారం ట్వీట్ చేశారు. ఇరు దేశాల పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, జిఇఎస్-2017లో అమెరికా ప్రతినిధి బృందానికి సారథ్యం వహించి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, ప్రపంచంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కలుసుకునే అవకాశం తనకు లభించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఇవాంకా ట్వీట్ చేశారు. ప్రపంచ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న కీలక పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ‘మహిళలకు తొలి ప్రాధాన్యం, అందరికీ సౌభాగ్యం’ అనే థీమ్‌తో నిర్వహించనున్న జిఇఎస్-2017లో కనీసం 50 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని ఆశిస్తున్నట్లు అమెరికా అధికారి తెలిపారు.

చిత్రం..అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్