బిజినెస్

యాక్సిస్ బ్యాంక్ కొత్త పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 17: తన గృహ రుణాల వ్యాపారాన్ని పెంచుకునే లక్ష్యంతో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ గురువారం ఒక కొత్త గృహ రుణ పథకాన్ని ప్రకటించింది. రుణం చెల్లింపు సమయంలో కొన్ని నెలవారీ కంతు(ఇఎంఐ)లను మాఫీ చేయడం ఈ పథకం ప్రత్యేకత. 20 ఏళ్ల కాలపరిమితి కలిగిన రుణంలో నాలుగు, ఎనిమిది, 12 సంవత్సరాలప్పుడు నాలుగు నెలవారీ కంతులను బ్యాంక్ మాఫీ చేస్తుంది. అంటే మొత్తం 12 ఇఎంఎంలు మాఫీ అవుతాయి. దీనివల్ల 30 లక్షల రుణం తీసుకున్న వ్యక్తికి దాదాపు రూ.3.09 లక్షల రూపాయలు ఆదా అవుతుందని బ్యాంక్ అంటోంది, రూ. 30 లక్షల దాకా ఉండే రుణాలపై ఈ మాఫీ వర్తిస్తుంది. రుణం చెల్లింపు కాలపరిమితి తగ్గింపు రూపంలో ఈ మాఫీ ఉంటుంది. అంతేకాదు వడ్డీ రేటు కూడా 8.35 శాతంగానే ఉంటుందని బ్యాంక్ స్పష్టం చేసింది. రుణ కాలపరిమితి తగ్గడం వల్ల వడ్డీ మార్జిన్‌పై దీని ప్రభావం ఉంటుంది కదా అని అడగ్గా, మెరుగైన క్రెడిట్ బిహేవియర్, ప్రీ పేమెంట్‌లు తగ్గడం కారణంగా దీర్ఘకాలం రుణం కొనసాగడం వల్ల బ్యాంక్ లబ్ధి పొందుతుందని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఆనంద్ చెప్పారు.