బిజినెస్

హెచ్‌డిఎఫ్‌సి పొదుపు ఖాతాల వడ్డీ రేట్లు తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: పొదుపు ఖాతాల్లో నగదు నిల్వలపై వడ్డీ రేట్లను ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి గురువారం తగ్గించింది. రూ. 50 లక్షల లోపు నగదు నిల్వలపై వడ్డీ రేటును 0.5 శాతం తగ్గిస్తూ 3.5 శాతానికి పరిమితం చేసింది. అయితే 50 లక్షల రూపాయలకు పైబడిన నిల్వలపై 4 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తామని బ్యాంక్ ప్రకటించింది. సవరణ తర్వాత రూ. 50 లక్షలు, అంతకు పైబడిన సేవింగ్స్ ఖాతా నిల్వలపై ఏడాదికి 4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అయితే 50 లక్షలకన్నా తక్కువ నిల్వలను కొనసాగించే ఖాతాదారులకు మాత్రం ఏడాదికి 3.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది’ అని హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ రెగ్యులేటర్ సెబికి సమర్పించిన ఒక లేఖలో తెలిపింది. సవరించిన వడ్డీ రేట్లు దేశంలోని వారికే కాక నాన్ రెసిడెంట్ ఖాతాదారులకు కూడా వర్తిస్తాయి. కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 19నుంచి అమలులోకి వస్తాయని కూడా బ్యాంక్ తెలిపింది.