బిజినెస్

డిసెంబర్ నాటికి న్యూ ఇండియా అస్యూరెన్స్ ఐపిఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ రంగ బీమా సంస్థ పబ్లిక్ ఇష్యూ(ఐపిఓ)కు రావడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా మార్కెట్లోకి రావడానికి వీలుగా న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీకి దీనికి సంబంధించిన ప్రాథమిక పత్రాలను త్వరలోనే సమర్పించనుంది. ప్రభుత్వ రంగంలోని నాలుగు జనరల్ బీమా సంస్థల్లో న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ ఒకటనే విషయం తెలిసిందే. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ క్యాలెండర్ సంవత్సరం చివరి నాటికల్లా ఐపిఓకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని తాము భావిస్తున్నామని న్యూ ఇండియా అస్యూరెన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) జి . శ్రీనివాసన్ చెప్పారు. ప్రతిపాదిత ఐపిఓకు సంబంధించి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను కంపెనీ త్వరలోనే సెబీకి సమర్పిస్తుందని కూడా ఆయన చెప్పారు. అయితే ఎప్పటిలోగా సమర్పించేది ఆయన చెప్పలేదు.