బిజినెస్

పరిశ్రమల స్థాపనకు.. సకాలంలో కార్యాచరణ : బాలమల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: పరిశ్రమలకు కేటాయించిన భూములను నిర్ణీత కాలపరిమితిలోగా వినియోగంలోకి తీసుకుని వచ్చేందుకు కొత్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల కల్పనా సంస్ధ (టిఎస్-ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. శుక్రవారం టిఎస్-ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు అధ్యక్షతన సంస్ధ 13వ పాలకవర్గం (బోర్డు) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సభ్యుల హోదాలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, విద్యుత్తు శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, పరిశ్రమల శాఖ కమిషనర్ నదీమ్ అహ్మద్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, టిఎస్-ఐఐసి ఆదాయం పెంచుకునేందుకు వీలుగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిర్ణీత గడువులోగా పరిశ్రమలు స్థాపించకుండా ప్రాజెక్టులను అమలుపరిచేందుకు అదనపు గడువు పొడిగింపు, ప్లాట్ల విభజనకు ప్రత్యేకంగా రూపొందించీన మార్గదర్శకాలను సమావేశంలో చర్చించారు. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘించే పారిశ్రామికవేత్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని, గరిష్టంగా 15 శాతం పెనాలిటీ విధించాలని నిర్ణయించారు. ఎస్‌సి, ఎస్‌టి పారిశ్రామికవేత్తలకు భూముల కేటాయింపు, దీర్ఘకాలిక లీజు ఇతర రాయితీల అమలుకు ఆమోదం తెలిపారు. వీటిపై ప్రభుత్వానికి నివేదిక పంపించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలమల్లు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో లోకల్ అథారిటీ (ఐఎఎల్‌ఎ) పరిథిలో ఆస్తి పన్నును ఆన్‌లైన్‌లో చెల్లింపు కోసం టిఎస్-ఐఐసి ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు.