బిజినెస్

గిట్టుబాటు ధర కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 12: ఐటిసి ఇతర కంపెనీలు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే ప్రభుత్వమే రంగ ప్రవేశం చేస్తుందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు హెచ్చరించారు. గురువారం స్ధానిక పేర్నమిట్ట పొగాకు బోర్డు వేలం కేంద్రాన్ని, పొగాగు బేళ్ళ అమ్మకాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇలాంటి పరిస్ధితులు రానివ్వకుండా ఐటిసితోపాటు ఇతర కంపెనీల ప్రతినిధులు మాట్లాడుకుని రైతులకు గిట్టుబాటు ధరల కల్పించాలన్నారు. రైతులు పొగాకు పంట కోసం బ్యాంకులనుండి అప్పులు తెచ్చి పంటలు పండించారని, రైతుకు న్యాయం చేసేందుకు అందరూ కృషిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో రైతులు పండించిన పొగాకుకు గిట్టుబాటు ధర తగ్గకుండా అమ్మకాలు చేయాలని పొగాకు అధికారులను, ఐటిసి కంపెనీ, ఇతర కంపెనీలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈసంవత్సరం పొగాకు రైతులు పొగాకు తక్కువగా పండించారన్నారు. అయినప్పటికీ రేట్లు తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు రైతులు తమ దృష్టికి తెచ్చారన్నారు. గత సంవత్సరం ఇదే పరిస్ధితి ఉందని, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు రెండుసార్లు పొగాకు కొనుగోళ్ళ కంపెనీలతో సమావేశం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
ఎపిపిఎస్‌సి ద్వారా త్వరలో 20వేల ఉద్యోగాలు
ఇదిలావుండగా ఎపిపిఎస్‌సి ద్వారా త్వరలో 20వేల ఉద్యోగాలు రానున్నాయని రాష్టర్రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. గురువారం ఆయన తన నివాసంలో విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో రూపొందించి వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.