బిజినెస్

స్టాక్ మార్కెట్లకు ఇన్ఫీ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ లిమిటెడ్ (సిఆర్‌పిఎల్)తో ఫ్రాంచైజీ ఒప్పందాన్ని మెక్‌డొనాల్డ్స్ రద్దు చేసుకుంది. దేశవ్యాప్తంగా మెక్‌డొనాల్డ్స్‌కు 430 ఫాస్ట్ఫుడ్ ఔట్‌లెట్లుండగా, వీటిని రెండు ఫ్రాంచైజీల ద్వారా నిర్వహిస్తోంది. అందులో ఒకటి కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ లిమిటెడ్. 169 ఔట్‌లెట్లు ఈ ఫ్రాంచైజీ నేతృత్వంలో నడస్తుండగా, విక్రమ్ బక్షీతో కలిసి కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ లిమిటెడ్‌ను మెక్‌డొనాల్డ్స్ ఏర్పాటు చేసింది. ఇందులో ఇరువురికి సమాన వాటాలుండగా, నిర్వహణకు సంబంధించి వివాదం ఏర్పడింది. కాగా, ఈ 169 ఔట్‌లెట్లకు మెక్‌డొనాల్డ్స్ పేరుండకూడదని, తమ వ్యవస్థ, ట్రేడ్‌మార్క్‌లను వినియోగించరాదని, 15 రోజుల్లో తొలగించాలని మెక్‌డొనాల్డ్స్ సిఆర్‌పిఎల్‌కు స్పష్టం చేసింది.