బిజినెస్

రాస్‌నెఫ్ట్ చేతికి ఎస్సార్ ఆయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 21: రుణ పీడిత ఎస్సార్ గ్రూప్.. సోమవారం రాస్‌నెఫ్ట్‌కు తమ ఎస్సార్ ఆయిల్ అమ్మకాన్ని పూర్తి చేసింది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ)గా పేర్కొంటున్న ఈ డీల్‌లో భాగంగా 12.9 బిలియన్ డాలర్లకు క్యాప్టివ్ పోర్టు, పవర్, రిటైల్ ఆస్తులను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, ఓ మదుపరుల కూటమికి ఎస్సార్ గ్రూప్ అమ్మేసింది. కాగా, ఎస్సార్ ఆయిల్ సిఇఒ రాజీనామా చేశారు. మరోవైపు ఎస్సార్ గ్రూప్ అధినేతలైన రుయాలు.. ఎస్సార్ ఆయిల్ అమ్మకంతో గ్రూప్ రుణ భారాన్ని 67 శాతం మేర తగ్గించుకున్నారు. మొత్తం ఎస్సార్ గ్రూప్ రుణ భారం 1.35 ట్రిలియన్ రూపాయలుండగా, 1.05 ట్రిలియన్ రూపాయలు తగ్గింది. అయితే ఈ అమ్మకంతో రుయాల ఉనికి చమురు శుద్ధి, రిటైల్ రంగాల నుంచి కనుమరుగైనట్లైంది.