బిజినెస్

తెలంగాణ జిసిసికి కొత్త పాలక మండలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణ గిరిజన సహకార సంస్థ (జిసిసి)కు కొత్త పాలక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు (జీఓ) జారీ అయ్యాయి. చైర్మన్‌గా డి మోహన్‌గాంధీ నాయక్‌ను నియమించారు. గిరిజన సంక్షేమ కమిషనర్/డైరెక్టర్, సహకార సంఘాల సొసైటీ రిజిస్ట్రార్ తరఫున ఒక ప్రతినిధి, అటవీ శాఖ తరఫున ఒక ప్రతినిధి, ఆర్థిక శాఖ కార్యదర్శి తరఫున ఒక అధికారి, గిరిజన సంక్షేమ డిప్యూటీ సెక్రటరీ, గురుకులాల కార్యదర్శి డైరెక్టర్లుగా ఉంటారని జీఓలో పేర్కొన్నారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిన ఎపి జిసిసి విభజన కాకపోవడం, ఆస్తుల విభజన జరగకపోవడం తెలంగాణ జిసిసిపై ప్రత్యేక బాధ్యతలు పడ్డాయి. తెలంగాణ జిసిసిని రిజిస్ట్రేషన్ చేయించడం, పాన్, టాన్, జిఎస్‌టి నెంబర్లను ప్రత్యేకంగా తీసుకోవడం, గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తుల అమ్మకం, ఉద్యోగుల ప్రమోషన్లు, ఉద్యోగులకు 2015 పిఆర్‌సి అమలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత జిసిసి ఆదాయం, ఖర్చుల వివరాలు పరిశీలించడం, అటవీ ఉత్పత్తులను ప్రాసెస్ చేసే యూనిట్లను కొత్తగా ఏర్పాటు చేయడం, జిసిసి లావాదేవీలకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యతను టిఎస్‌జిసిసికి అప్పగిస్తున్నారు.