బిజినెస్

ఎస్‌బిఐ పండగ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశీయ బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఖాతాదారులకు శుభవార్త. రాబోయే పండగ సీజన్ దృష్ట్యా కార్ల రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలను ఎస్‌బిఐ ఎత్తివేసింది మరి. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కార్ల రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలుండవని సోమవారం ఓ ప్రకటనలో ఎస్‌బిఐ పేర్కొంది. అలాగే పసిడి రుణాల (బంగారాన్ని తాకట్టుపెట్టి నగదు తీసుకునేవి)పై ప్రాసెసింగ్ ఫీజును 50 శాతం తగ్గించింది. ఈ సదుపాయం ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. ఇక వచ్చే నెలాఖరు (సెప్టెంబర్ 30)దాకా వ్యక్తిగత రుణాల (ఎక్స్‌ప్రెస్ క్రెడిట్)పై ప్రాసెసింగ్ ఫీజు 50 శాతమే వసూలు చేస్తామని ఎస్‌బిఐ ఈ సందర్భంగా ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇప్పటికే గృహ రుణాలపైనా ప్రాసెసింగ్ ఫీజును ఎస్‌బిఐ తగ్గించినది తెలిసిందే. దేశవ్యాప్తంగా 23 వేలకుపైగా శాఖలను కలిగిన ఎస్‌బిఐకి 37 కోట్లకుపైగా ఖాతాదారులున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహి ళా బ్యాంకును విలీనం చేసుకున్న ఎస్‌బిఐకి ప్రస్తుతం 59 వేలకుపైగా ఎటిఎమ్‌లున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ ట్రేడింగ్‌లో ఎస్‌బిఐ షేర్ విలువ గత శుక్రవారం ముగింపుతో చూస్తే 1.44 శాతం పడిపోయి 274.65 వద్ద నిలిచింది.