బిజినెస్

స్తంభించిన బ్యాంకింగ్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: బ్యాంక్ ఉద్యోగుల ఒకరోజు దేశవ్యాప్త సమ్మెతో మంగళవారం బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోయాయి. ప్రభుత్వ బ్యాంకుల విలీనాలు, మొండి బకాయల సమస్య, ఇతరత్రా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ బంద్‌తో పలుచోట్ల ఎటిఎమ్‌లలో నగదు కొరత ఏర్పడింది. అయతే ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడినా.. ప్రైవేట్ రంగ బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్‌లు పనిచేశాయి. దీంతో కొంతవరకు ఆర్థిక లావాదేవీలు కొనసాగగా, చెక్కు క్లియరెన్సులు తదితర సేవలకు మాత్రం అంతరాయం ఏర్పడింది. కాగా, ముంబయి, కోల్‌కతా, పాట్నా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె, జైపూర్, హైదరాబాద్ తదితర వ్యాపార ప్రాంతాలపై బంద్ ప్రభావం కనిపించింది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) పిలుపు మేరకు దాని ఆధ్వర్యంలోని తొమ్మిది ఉద్యోగ సంఘాలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్: ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను ప్రైవేట్ పరం చేయవద్దని, జాతీయ స్థాయిలో బ్యాంకుల విలీనం ప్రక్రియను నిలిపివేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం చేసిన సమ్మెతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులన్నీ మూతపడ్డాయి. రెండు రాష్ట్రాల్లోని అన్ని పట్టణాల్లో బ్యాంకు ఉద్యోగులు నిరసన, ర్యాలీలు నిర్వహించారు. జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు మంగళవారం సమ్మె జరగగా, తెలంగాణలోని దాదాపు ఐదు వేల బ్యాంకు శాఖలు, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు ఆరు వేల బ్యాంకు శాఖలు మూతపడటంతో బ్యాంకింగ్ లావాదేవీలు దాదాపు నిలిచిపోయాయి. సమ్మె సందర్భంగా అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి బిఎస్ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వచ్చే నెల 15న ఛలో పార్లమెంట్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలను రద్దు చేయవద్దని, ఈ రుణాలను ఖచ్చితంగా వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిరర్థక ఆస్తులను (ఎన్‌పిఎ) వసూలు చేసేందుకు పార్లమెంటరీ కమిటీ చేసిన సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని రాంబాబు డిమాండ్ చేశారు.