బిజినెస్

లెదర్ గూడ్స్‌పై సుంకాలు తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: లెదర్ గూడ్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులతో పాటు కొన్ని రకాల జౌళి వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా ఇరు దేశాల మధ్య వ్యాపార అభివృద్ధికి కృషి చేయాలని ఉజ్బెకిస్తాన్‌కు భారత్ విజ్ఞప్తి చేసిందని కేంద్ర వాణిజ్య శాఖ గురువారం వెల్లడించింది. ఉజ్బెకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్ అజీజ్ కమిలోవ్, విదేశీ వాణిజ్య శాఖ మంత్రి ఎలియర్ గనియెవ్‌తో బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. భారత్‌కు ప్రస్తుతం అత్యంత సానుకూల దేశంగా ఉన్న ఉజ్బెకిస్తాన్‌లో లెదర్ గూడ్స్‌తో పాటు పాదరక్షలపై 30 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించాల్సిందిగా నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారని, అలాగే భారత్ నుంచి ఎగుమతయ్యే కొన్ని రకాల జౌళి, ఇంజనీరింగ్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని తగ్గించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా కూడా కోరారని వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.