బిజినెస్

కడియానికి.. వడివడిగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 24: దేశవ్యాప్తంగా ఎంతో పేరు పొందిన తూర్పుగోదావరి జిల్లా కడియపులంక పూల మార్కెట్ వినాయకచవితి శోభతో కళకళలాడుతోంది. చవితిని పురస్కరించుకుని గత మూడు రోజులుగా కడియపులంక మార్కెట్‌లో పూల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ తోటల నుండి దిగుబడులు ఇంకా రాకపోవడంతో కర్ణాటక, తమిళనాడు నుండి పూలను భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. అలా దిగుమతి చేసుకున్న పూలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌కు సైతం పూలు ఎగుమతి చేస్తున్నారు. చవితి డిమాండుతో దిగుమతులు, ఎగుమతులతో మార్కెట్ రద్దీగా మారింది. వినాయకచవితి సందర్భంగా కోట్ల రూపాయల పూల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. దీనితో ధరలు భారీగానే పెరిగాయి. కిలో చామంతి రూ.350, మేరీగోల్డ్ రూ.250, బంతి రూ.60-70, లిలీ రూ.150, మల్లి రూ.500, వంద గులాబీలు రూ.100 ధర పలుకుతోంది.
దిగుమతి ఎగుమతులు జోరుగా సాగుతుండటంతో పూల కమిషన్ వ్యాపారులు, ప్యాకింగ్ వ్యాపారులకు చేతినిండా పనిదొరికింది. వినాయకచవితి సందర్భంగా బంతి, చామంతులకు మంచి డిమాండ్ ఏర్పడిందని కమిషన్ వ్యాపారులు చెబుతున్నారు. వాతావరణం కూడా అనుకూలించడంతో ఎగుమతులు కూడా ఊపందుకున్నాయంటున్నారు.

చిత్రం.. క్రయ, విక్రయాలతో సందడిగా కనిపిస్తున్న కడియపులంక పూల మార్కెట్