బిజినెస్

2019 నాటికి 8% వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: భారత దేశం మరో 2-3 ఏళ్లలో 8 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నీతి ఆయోగ్ గురువారం పేర్కొంది. దేశంలోని 125 కోట్ల మంది పౌరులు సుఖ సంతోషాలతో ఉండడానికి అనేక సంస్కరణలు తీసుకు రావలసిన అవసరం ఉందని కూడా తెలిపింది. రాబోయే మూడేళ్ల కాలానికి అంటే 2017-18 ఆర్థిక సంవత్సరంనుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం దాకా రూపొందించిన మూడేళ్ల ఆర్థిక కార్యాచరణలో నీతి ఆయోగ్ ఆర్థిక, న్యాయ వ్యవస్థ, రెగ్యులేటరీ వ్యవస్థ, సామాజిక రంగాల్లో తీసుకు రావలసిన సంస్కరణల గురించి వివరణాత్మక కార్యాచరణను ప్రకటించింది. ‘ఇప్పటికిప్పుడు కాకపోయినప్పటికీ రాబోయే 2-3 ఏళ్లలో మనం తిరిగి 8 శాతానికి పైగా వృద్ధిరేటు సాధించేందుకు అవకావాలు పుష్కలంగా ఉన్నాయి’ అని ఆ ప్రణాళిక పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికాభివృద్ధి 7.1 శాతానికి మందగించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి వృద్ధి గణాంకాలను సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఈ నెల 31న విడుదల చేయనుంది.
కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చులను భవిష్యత్తు ప్రాధామ్యాలతో ముడిపెట్టాలని, అలాగే మరింత ఎక్కువ అభివృద్ధిని ప్రోది చేసే అవకాశమున్న అధిక ప్రాధాన్యతా రంగాలకు అదనపు పెట్టుబడులను కేటాయించాలని నీతి ఆయోగ్ తన కార్యాచరణ అజెండాలో సూచించింది 2019-20 నాటికి విద్యా, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రక్షణ, రైల్వేలు, రోడ్లు, వౌలిక పెట్టుబడులకు సంబంధించిన ఇతర కేటగిరీలపై వ్యయం భారీగా విస్తరించాలని ఈ ప్రతిపాదనల అర్థమని ఆ అజెండా పేర్కొంది. దేశంలో పట్టణీకరణకు వీలు కల్పించడంతో పాటుగా చౌకగా గృహవసతి, వౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా రవాణా లాంటి ప్రధాన సమస్యలను పరిష్కరించడంతో పాటుగా స్వచ్ఛ్భారత్‌ను ప్రోత్సహించడానికి ఈ ప్రతిపాదనలు తోడ్పడతాయని ఆ నివేదిక పేర్కొంది. దేశంలో అవినీతి, నల్లధనాన్ని అంతమొందించడానికి, అలాగే పన్నుల బేస్‌ను పెంచడానికి పలు సూచనలు చేయడంతో పాటుగా సివిల్ సర్వీసులు, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణను కూడా సూచించింది.
ఇక సామాజిక రంగానికి సంబంధించిన సంస్కరణల్లో విద్య, నైపుణ్య వృద్ధి, ఆరోగ్యం, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు లాంటి నిర్దిష్ట వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ఆ అజెండా పేర్కొంది. అలాగే పర్యావరణ పరిరక్షణకోసం రెగ్యులేటరీ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని సైతం 211 పేజిల ఆ పత్రం నొక్కి చెప్పింది.
డిసెంబర్ నాటికి 7.9 శాతం వృద్ధి : మోర్గాన్ స్టాన్లీ
సానుకూలమైన విదేశీ డిమాండ్, మెరుగుపడుతున్న కార్పొరేట్ సంస్థల బ్యాలెన్స్ షీట్లు, ప్రైవేట్ పెట్టుబడుల రికవరీ కారణంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక వృద్ధి దశ (ప్రొడక్టివ్ గ్రోత్ ఫేజ్)లోకి అడుగుపెడుతోందని, డిసెంబర్ నాటికి దాని జిడిపి వృద్ధి 7.9 శాతానికి పెరిగే అవకాశముందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఒక పరిశోధనా పత్రంలో పేర్కొంది. జిడిపి వృద్ధి మెరుగులకు, నిలకడయిన వృద్ధి వలయానికి సంకేతంగా ప్రొడక్టివ్ గ్రోత్ ఫేజ్ అనే సాంకేతిక పదాన్ని ఉపయోగిస్తారు. జిడిపి వృద్ధి మరింత వేగం పుంజుకోవచ్చని రాబోయే మూడు దశల్లో ఇది దాదాపు 1 శాతం దాకా ఉండవచ్చని ఆ పరిశోధనా పత్రం అంచనా వేసింది. ఈ వృద్ధి వేగం ఈ ఏడాది రెండో త్రైమాసికంనుంచే మొదలై ఏడాది చివరి నాటికి దాదాపు ఒక శాతం దాకా ఉండవచ్చని కూడా ఆ పత్రంలో పేర్కొన్నారు. జిఎస్‌టి అమలు వృద్ధి వేగానికి ఒక అడ్డంకి కాబోదని కూడా ఆ పత్రంలో అభిప్రాయ పడ్డారు. నిజానికి జిఎస్‌టిని ప్రవేశపెట్టడం వల్ల జిడిపి వృద్ధిలో పెరుగుదల దాదాపు అరశాతం దాకా ఉండవచ్చని ఆ పరిశోధనా పత్రంలో మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయ పడింది.