బిజినెస్

వృద్ధి రేటు 8 శాతానికి పెరగొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: ఈ ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వృద్ధిరేటు 8 శాతం చేరుకుంటుందని భావిస్తున్నట్లు భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) అధ్యక్షుడు డాక్టర్ నౌషద్ ఫోర్భ్స్ తెలిపారు. అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వ్యవసాయ రంగం పుంజుకోవడం ద్వారా జిడిపిలో వృద్ధి శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సిఐఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి హైదరాబాద్ విచ్చేసిన డాక్టర్ నౌషద్ గురువారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాతావరణ అనుకూల పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారుల సానుకూలత, భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిపడ్డం వల్ల ఆర్థిక వృద్ధి రేటు 8 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 3 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న పరిస్థితిలో పరిశ్రమలు, సేవా రంగంలో కూడా 8.2 శాతం, 9.8 శాతం వృద్ధి కనిపించవచ్చని అంచనా వేస్తున్నట్లు సిఐఐ అధ్యక్షుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మితమవుతున్న ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంలో భాగంగా సిఐఐ కార్యకలాపాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అమరావతిలో 10 ఎకరాల్లో స్టార్టప్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 9 స్టార్టప్ కేంద్రాలు దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఏర్పాటు కాగా, 10వ స్టార్టప్ సెంటర్‌ను అమరావతిలో రానున్న మరికొన్ని నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు.దీనికి తోడు 100 ఎకరాల్లో కనె్వన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా పెట్టుబడులు, పరిశ్రమల రాకకు అవకాశం కలుగుతుందని, ఒక నగరం అభివృద్ధికి తమ వంతు ప్రయత్నం చేసినట్లు అవుతుందని నౌషద్ వెల్లడించారు. సిఐఐ తరఫున దేశంలోనే తొలిసారిగి సిఐఐ యూనివర్శిటీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విశ్వవిద్యాలయం ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. మరికొన్ని రోజుల్లో కీలక దశకు చేరుకుంటుందని చెప్పారు. గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే విధంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్ (పిపిపి) పద్దతిలో స్టార్టప్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సెంటర్ల ఏర్పాటు ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. సిఐఐ కార్యకలాపాలను వివరిస్తూ దేశ వ్యాప్తంగా ఆరు ఉత్పాదక రంగాలను, 26 ఉప రంగాలను అభివృద్ధి చేసేందుకు గుర్తించామని అన్నారు. ఆటోమోటివ్స్, ఎయిరోస్పేస్, డిఫెన్స్, ఇంజినీరింగ్, సిమెంట్, స్టీల్, కెమికల్, ఫార్మా, ఐసిటిఇ వంటి ఆరు రంగాలను అభివృద్ధి చేసేందుకు సిఐఐ వ్యూహాత్మక రోడ్ మ్యాప్‌ను త్వరలో రూపొందించనున్నట్లు తెలిపింది. జిఎస్‌టి బిల్లుకు త్వరలో మోక్షం లభిస్తుందని భావిస్తున్నామని, సిఐఐ తరపున రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులకు ఇప్పటికే విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు.

చిత్రం సిఐఐ అధ్యక్షుడు డాక్టర్ నౌషద్ ఫోర్బ్స్